గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా పవిత్ర లోకేష్, నరేష్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఎట్టకేలకు వీరిద్దరూ ఇలాంటి వార్తలకి చెక్ పెడుతూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్టు ఒక వీడియోను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.
తాజాగా పవిత్ర లోకేష్ మొదటి భర్త పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవిత్ర మొదటి భర్త కనడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ వివాహం చేసుకొని వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత ఆయనతో విభేదాలు రావడం వల్ల అతని నుంచి విడాకులు ఇచ్చి తిరిగి నరేష్తో తిరగడం ప్రారంభించింది. అయితే సుచేంద్ర తాజాగా మాట్లాడుతూ.. పవిత్రకు ఎక్కువగా లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టము. ఆమె ఒక అవకాశవాది.
విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్లు ఆస్తిని నొక్కేసిందని తెలిపారు. తన దగ్గర మాత్రం డబ్బులు లేకపోవడంతో తనను వదిలేసి నరేష్ తగులుకుంది అంటూ షాపింగ్ కామెంట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు డబ్బు పై వ్యామోహం ఎక్కువ అంటూ తెలిపారు. ప్రస్తుతం పవిత్ర లోకేష్ మొదటి భర్త చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పవిత్ర లోకేష్ కి ఇది రెండవ వివాహం అయితే నరేష్ కు ఇది నాలుగవ వివాహం. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.