టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. ఈ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి మరొకసారి తన సత్తా చాటారు రాజమౌళి. ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఇందులోని ఎన్టీఆర్ నటన కు ఆస్కార్ వస్తుందని అందరూ అనుకోగా కానీ అందులో నిరాశ మిగిల్చింది. కానీ అంతవరకు ఎన్టీఆర్ వెళ్లడంతో ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచేశారు.
ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో పాటు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తదితరులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్కార్ అవార్డు రావాలని కొంతమంది తెలుగు ప్రేక్షకులు పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటుకు ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది ఈ చిత్రం. ఆస్కార్ దక్కించుకున్న మొదటి భారతీయ గీతంగా ఈ పాట రికార్డులోకి ఎక్కింది.
హాలీవుడ్ పాటలను తలదన్నేలా చివరి వరకు చేరిన నాటు నాటు పాటు విజయతం గానే నిలిచింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సింప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.