జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజీ సంపాదించుకున్న కమెడియన్ కిరాక్ ఆర్పి కూడా ఒకరు. జబర్దస్త్ లో ఉన్నవాళ్లు తనదైన శైలిలో పంచులు, కామెడీ స్క్రిప్ట్, ప్రేక్షకుల ను చేయకులన బాగా అలరించారు ఆర్పీ. గత కొన్నేళ్లుగా టీవీకి దూరంగా ఉన్న కిరాక్ ఆర్పి బిజినెస్ లో రాణిస్తున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారు. హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్‌ను ప్రారంభించి మళ్ళీ పాపులర్ అయ్యారు. అంతేకాకుండా సెలబ్రిటీలతో తన చేపల పులుసును కూడా ప్రమోట్ చేస్తూ తెగ వైరల్ గా మారుతున్నారు ఆర్పి.
ఇక రీసెంట్గా అమీర్‌పేట్ లో తన చేపల పులుసు మూడో బ్రాంచ్ ను ఓపెన్ చేశారట ఆర్పి .తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్న తో పెళ్లి గురించి మాట్లాడడం జరిగింది. గత ఏడాది మే నెలలో ఆర్పీకి లక్ష్మీ ప్రసన్నత చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది.ఆ తర్వాత పెళ్లి డేట్ ను మాత్రం చేయలేదు. దీంతో ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పి మాట్లాడుతూ.. నాకు అబద్దాలు చెప్పడం రాదు ఆమె వెంట రెండేళ్లు పిచ్చి కుక్కలా తిరిగాను మొత్తానికి వాళ్ల తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకున్నారు ఏడాది నవంబర్ 29న వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆర్పి ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్న మరొకసారి తన లవ్ స్టోరీని రివిల్ చేసింది. ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు కిరాక్ ఆర్పి గెస్ట్ గా వచ్చారు. అక్కడే మా ఇద్దరికీ మొదట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా అమ్మ నెంబర్ తీసుకొని ముందు ఫ్యామిలీకి బంధువులకు దగ్గరయ్యారు.. ఆ తర్వాత మా పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు దీంతో ఇద్దరం హ్యాపీగా ఉన్నామని తెలుపుతోంది.