ఇప్పటికే ఆస్కార్ అవార్డు వేడుక చాలా ఘనంగా జరుగుతోంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇండియా నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులు ఈ ఆస్కార్ వేడుకపై చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. ఇక దీంతోపాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో కూడా ది ఎలిఫెంట్ విస్పరస్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో ఆల్ ది బ్రిత్స్ చిత్రాలు కూడా ఇండియా నుంచి నామినేట్ అయ్యాయి.
అయితే ఈ మూడు కూడా ఆస్కార్ అవార్డులు సాధించాలని భారతీయులు ఎక్కువగా కోరుకుంటున్నారు.ఈ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా అని టాలీవుడ్లో బెట్టింగ్ వేసుకుంటున్నారట. ఒక తెలుగు సినిమా నుంచి ఒక పాట ఆస్కార్ దాక వెళ్లడంతో ప్రేక్షకులు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తికరంగా అవార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లాగే ఈ బెట్టింగ్ కూడా భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇప్పుడు RRR నాటు నాటు సాంగుకు కూడా ఆస్కార్ వస్తుందా రాదా అని టాలీవుడ్ లో బెట్టింగ్ వేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా నిర్మాతలు టెక్నీషియన్స్ టాలీవుడ్ లోని ఉండేవారు. కొంతమంది ఈ బెట్టింగ్ వేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆస్కార్ దాకా వెళ్లి సరికొత్త చరిత్రలు సృష్టిస్తున్నరని ఒకపక్క గర్వపడుతుంటే మరొక పక్క ఇలా బెట్టింగ్లు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది చూసిన కొంతమంది జనాలు కూడా బెట్టింగ్ వేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.