టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది యమున. ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇమే మొట్టమొదటిగా మౌన పోరాటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యమున. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ అప్పట్లో ఒరేంజ్ లో సక్సెస్ అయ్యాయి.
ఇంకా బుల్లితెర పై కూడా బోలెడన్ని సీరియల్స్ లో అవకాశాలను దక్కించుకుని బిజీ బిజీగా గడిపేస్తోంది. ఒక వైపు బుల్లితెరపై ప్రచారమయ్యే సీరియల్స్ నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది. ఇకపోతే నటి యమునా 2011లో బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టు పడిందని వార్త అప్పట్లో సంచలనం రేపింది.
అయితే ఈ వ్యవహారంలో యమునా తప్పేమీ లేదంటూ కావాలనే తను ఇరికించారంటూ న్యాయస్థానంలో క్లీన్ చీట్ లభించింది. దీని గురించి పలు సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పుకొచ్చింది యమున. తాజాగా అదే విషయం గురించి స్పందిస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ అండి నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్న కూడా మీరు అనే మాటలకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటూ ఆమె ఎమోషనల్ ఫీల్ అయింది. అయితే నన్ను ఇప్పటికీ ఆ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్ మీడియా వల్ల ఎందుకంటే నేను చాలా ఏళ్ల క్రితం ఓ సమస్య నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. అలాంటి ప్రాబ్లంలో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చాను. చెప్పాలంటే న్యాయపరంగా విజయం సాధించాను కానీ సోషల్ మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను.