ఇళయ దళపతి విజయ్ కి తమిళ నాటా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత పేరు సంపాదించుకున్నారు. వారిసు చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయ్ తన తల్లిదండ్రులని అవమానించారన్న వార్తలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి . ఆ ఈవెంట్లో విజయ్ తన తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోలేదని ఇవ్వవలసినంత మర్యాద వారికి ఇవ్వలేదన్న పుకార్లు ఊపందుకున్నాయి.
జనవరి 2న వారిసు ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి ఎస్. చంద్రశేఖర్ , ఆయన తల్లి శోభన కూడా వచ్చారు. ఈవెంట్ లోకి వచ్చినప్పుడు అందర్నీ పలకరిస్తూ వచ్చిన విజయ్.. తల్లిదండ్రుల దగ్గర కూడా వచ్చారు. వారిని కూడా పలకరించి పక్కనుంచి ముందుకు వెళ్లిపోయారు. అయితే తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోలేదని.. ఏదో మొక్కుబడిగా వారిని పలకరించారన్న వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
దీనిపై ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తల్లి శోభన మాట్లాడుతూ..” ఆ వేడుక కేవలం వారిసు సినిమా కోసం.. విజయ్ కోసం జరిగింది.. ఓ పెద్ద ఈవెంట్ లో నా కుమారుడి నుంచి అంతకన్నా మేము ఏం ఆశిస్తాం చెప్పండి ” అని తెలిపింది. ఇకపోతే విజయ్ కి తన తండ్రి చంద్రశేఖర్ కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి చంద్రశేఖర్ గతంలో కుమారుడు విజయ్ పేరిట ఒక పార్టీ పెట్టారు. అయితే ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేశారు . ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.