సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటినుంచో ఉన్నటువంటి విషయమే.. అయితే మీటు ఉద్యమం వచ్చిన తర్వాత నుంచే ఈ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ ఉద్యమం సమయంలో ఎంతోమంది తారలు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే స్టార్ నటీమణులు కూడా ఓపెన్ అయ్యి వారికి జరిగిన కొన్ని చేదు సంఘటనలను తెలియజేశారు. ఇప్పుడు లేటెస్ట్గా విద్యాబాలన్ కూడా కాస్టింగ్ కౌచ్ పైన పను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా .. విద్యాబాలన్ ఒక దర్శకుడు తనని కాఫీకి పిలిచి రూముకి రమ్మన్నాడని అయితే అతనీ చేతిలో నుంచి ఎలా తప్పించుకున్నానని విషయాన్ని కూడా తెలియజేసింది.. విద్యాబాలన్ మాట్లాడుతూ.. దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక యాడ్ ఫిలిం కోసం డైరెక్టర్ ను కలిసేందుకు చెన్నైకి వెళ్లానని.. అక్కడ కాఫీ షాప్ లో మాట్లాడుకుందామని నేను చెప్పాను.. కానీ డైరెక్టర్ నన్ను రూముకు వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పారట.
దీంతో విద్యాబాలన్ అతని ఉద్దేశాన్ని గమనించి గదిలోకి వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేయకుండా కాస్త తెరిచే ఉంచానని అది గమనించిన దర్శకుడు ఏమి మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారని ఆ సమయంలో నేను తెలివిగా ప్రదర్శించడం వల్లే అక్కడ నుంచి తప్పించుకోగలిగానని.. ఇప్పటికి ఆ సంఘటన మరిచిపోలేకపోతున్నాను అంటూ తెలుపుతోంది. ఇదొక్కటే కాకుండా ఇలాంటి సంఘటనలు చాలానే ఎదుర్కొన్నాను వాటి వల్ల మానసిక ఇబ్బందులు కూడా పడ్డాను మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలుపుతోంది విద్యాబాలన్.