చిరంజీవి సక్సెస్ వెనక అల్లు అరవింద్ పాత్ర ఉందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో మంచి చిత్రాలతో నటించి పెరు సంపాదించుకున్నారు చిరంజీవి .ఎవరి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో విలన్ గాను మరికొన్ని చిత్రాల్లో హీరోగాను నటిస్తూ అంచలంచలుగా ఎదిగారు. ఆ తరువాత సురేఖ గారిని పెళ్లి చేసుకున్నాక సురేఖ గారి నాన్నగారు అల్లు రామలింగయ్య సురేఖ గారి అన్నగారు అల్లు అరవింద్ వీరిద్దరూ సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి వ్యవహారాలు మొత్తం చూసుకునేవారట. ముఖ్యంగా డైరెక్టర్ లతో మాట్లాడి సినిమాలు చిరంజీవికి సెట్ అయితాయా లేదా అని చూసేవారట.

Allu Aravind complains to Chiranjeevi about Ram Charan's delay

అయితే అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ ఆయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉంటు ఆయన కూడా బాగానే సంపాదించుకున్నాడు. ఇప్పుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారి కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యారు.అలాగే అల్లు అరవింద్ కూడా ఆహా అనే ఓటీటి ప్లాట్ ఫాం పెట్టి ఇటు సినిమాలకు ప్రొడ్యూసర్ గాను అటు ఆహాకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు అల్లు అరవింద్ గారు చిరంజీవిని అంటిపెట్టుకొని ఉండేవారు. మంచి మంచి సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేశారు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవితో కానీ పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ లతో సినిమాలు ప్రొడ్యూస్ చేయగ చాలా సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో కొత్త కొత్త నిర్మాతలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కాస్త ఈమధ్య మెగా కుటుంబానికి నిర్మాతగా దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

Share.