జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక సినిమాలు విషయం పక్కన పడితే రాజకీయాలలో ఎన్టీఆర్ పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాలలో సత్తా చాటుతాడని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయంగా తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇటీవల నటుడు పోసాని, ఎన్టీఆర్ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న పోసాని ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్న పరిస్థితులలో ఆమె భార్య మరణించింది ఆ సమయంలో ఎన్టీఆర్ కు అండగా ఉండేందుకు లక్ష్మీపార్వతి ఆయనకు అండగా ఉండేందుకు ఆయనను వివాహం చేసుకున్నదని తెలిపారు. అలాంటి మహిళను పట్టుకొని చంద్రబాబు టిడిపి వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటారని తెలుపుతున్నారు.
కానీ లక్ష్మీపార్వతని తిట్టిన వాళ్లు హరికృష్ణ రెండవ భార్యను మాత్రం తిట్టలేరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోరు కనుక..తారక్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరో కాబట్టి అందరూ భయపడుతున్నారు. పైగా అతనితో బాబుకు చాలా అవసరం ఉంది.. ఆ తరువాత ముఖ్యమంత్రి గల కెపాసిటీ ఎన్టీఆర్కు మాత్రమే ఉందని అందుకోసమే ఎన్టీఆర్ ని ఎవరు ఏమనడం లేదు. అతనితో మంచిగా ఉంటే ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా తమ పార్టీకే పడతాయని చంద్రబాబు భావిస్తున్నారని పోసాని తెలిపారు. ప్రస్తుతం పోసాని చేస్తున్న ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి