సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఎదగాలి అంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. ముఖ్యంగా అందంలో కూడా ఆకట్టుకునేలా ఉండాలి. హీరోయిన్స్ విషయంలో ఈ అందం కచ్చితంగా ఉండాల్సిందే సినీ తారల స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ రూపం ఏకంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలి. ముఖ్యంగా ముఖం అందం కూడా ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలి.ఇందుకోసం కొంతమంది హీరోయిన్స్ సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అలా సర్జరీ చేయించుకున్న వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు.
ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కుకు సర్జరీ చేయించుకుంద. ఈ విషయాన్ని తన ఆత్మ కథ అండ్ ఫినిష్ఠుడిలో వ్రాసుకొచ్చింది. అయితే తన ముక్కు సర్జరీ ఫెయిల్ అయ్యి తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని దీంతో చాలా భయపడ్డానని ఆ సమయంలో నిస్సహాయురాలుగా ఉండిపోయానని తెలియజేస్తోంది. తన ముక్కుకు సర్జరీ చేసే సమయంలో డాక్టర్ ఆసక్తిని కోల్పోయాడు దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజ్ తొలగించగానే నా ముక్కు చూసి అమ్మ నేను భయపడిపోయాము .అది వంకరగా మారిపోయిన ముఖమే మరొక లాగా కనిపించేది.. అసలు నేను నాలాగే లేను అద్దంలో నన్ను చూసి ఎవరో అనుకున్నట్టుగా ఉన్నాను అంటూ తెలిపింది.
తన ఆత్మగౌరం తగ్గిపోయినట్టుగా అనిపించిందని తిరిగి మళ్ళీ మామూలు మనిషిగా కోలుకుంటానని అనుకోలేదని రాసుకు వచ్చింది ప్రియాంక. ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో ఆమె అందం కోసం సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపించాయి. అయితే సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అంద విహీనంగా మారిందని దీంతో ముక్కు సాధారణ తెచ్చేందుకు మళ్లీ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం కేవలం ఇలా ప్రియాంక చోప్రా మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ చేయించుకున్నారు.