తెలుగు చిత్ర పరిశ్రమకు నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది మాధవి లత. ఈమె ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ ని సాధించింది. ఆ తరువాత అగ్ర హీరో అయినా మహేష్ బాబు అతిధి సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించింది. నచ్చావులే సినిమా తరువాత చాలా సినిమాలు చేసింది. కానీ అవేమీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఆమెకి పెద్దగా అవకాశాలు కూడా రాలేదనే చెప్ప వచ్చు. అసలు విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలో కొందరు ఏదో రకంగా మిగతా ఆర్టిస్టులని వాడుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కనీసం ఒక అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు.
అయితే మాధవి లత కెరియర్ స్టార్టింగ్ లో ఒక డైరెక్టర్ తనని విపరీతంగా వేధించేవాడట. ఏదో ఒక రకంగా తనని వాడుకోవాలని ప్రయత్నం చేసి వీలు కాకపోవటంతో తనని వదిలేశాడట. అయితే తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా ఆవిడ ఏది ఉన్న దాచకుండా మొహం మీదే చెప్తూ ఉండాలి..
ప్రస్తుతం మాధవి లత వెబ్ సిరీస్లు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఆమె ఇండస్ట్రీలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎవ్వరు ఎదుర్కోవద్దని ఆమె అందరికీ తన అనుభవాలను తెలియజేస్తూ ఉంటుంది.. మాధవి లత వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా మంచి మంచి సీరియల్స్ లో నటించి అప్పట్లో గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇండస్ట్రీలో జరిగే ఎటువంటి వాటిపైన కూడా పలు రకాలుగా స్పందిస్తూనే ఉంటుంది హీరోయిన్ మాధవి లత.