టాలీవుడ్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం అగ్ని నక్షత్రం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని అచ్చు రాజారణినీ మ్యూజిక్ అందించారు. నిన్నటి రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి తెలుసా తెలుసా అనే పాటను కూడా సమంత రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఉమెన్ ఎంపరిమెంట్కు సంబంధించిన పాట కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశామని తెలియజేశారు చిత్రబృందం.
తన కూతురుతో కలిసి నటించడం ఇదే మొదటిసారి అని మంచు లక్ష్మి తెలియజేసింది. హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ.. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం అని ఇప్పటివరకు ఆమె ఎన్ని కష్టాలు పడిందో తనకు మాత్రమే తెలుసని తెలుపుతోంది. సమంతాతో తనకున్న అనుబంధం గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం ఈ పరిశ్రమలో మహిళలుగా మనం ఏదైనా సొంతంగా చేయాల్సిందే.. ఆమె స్థానంలో మరొకరు ఉంటే నలిగిపోయేవారు జీవితంలో క్లిష్ట దశలో కూడా సమంత తనను తాను మలుచుకున్న తీరు దేశంలోని మహిళలందరికీ స్ఫూర్తినిస్తుంది అంటూ తెలిపింది
తెలుసా తెలుసా పాట గురించి సమంత మాట్లాడుతూ.. ఇలాంటి పవర్ఫుల్ పాటతో వచ్చినందుకు లక్ష్మి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను చాలా ఇన్స్పిరింగా ఉన్నటువంటి ఈ పాట రోజుల తరబడి మనతోనే ప్రయాణిస్తుంది.. విజువల్ వండర్ గా ఈ సినిమా అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను అని సమంత తెలియజేస్తోంది. ప్రస్తుతం సమంతపై చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.