నిన్న హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రంగులతో బాగా ఎంజాయ్ చేశారు.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కూడా అందరూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేసిన సందర్భాలను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది. అయితే తాజాగా యాంకర్ అనసూయ తన కుటుంబంతో కలసి హోలీ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నది. అందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.
యాంకర్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఈమె ఇప్పటికీ నటిగా కూడా బాగా దూసుకుపోతోంది. మొదట్లో టీవీలలో వార్తలు చెబుతున్న ఈమె ఆ సమయంలో వెండితెర పైన సైడ్ క్యారెక్టర్ లో కూడా నటించింది.ఆ తరువాత జబర్దస్త్ బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో అనసూయ కెరియర్ ఒక్కసారిగా తారుమార అయింది. అక్కడ నుంచి తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంటూ పాపులారిటీ మరింత సంపాదించింది. వెండితెర పైన రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా నటించి బాగా క్రేజ్ సంపాదించింది.
దీంతో అప్పటినుంచి వరుసగా అవకాశాలు అందుకుంటూ తిరిగి చూడకూడదు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో అందరు షాక్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇందులో హోలీ పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో రంగులు కొంటూ కనిపించింది అనసూయ. ఈ ఫోటోలు చూసిన అభిమానులు లైక్స్ కొడుతుంటే మరి కొంతమంది హ్యాపీ ఉమెన్స్ డే అంటూ తెలియజేస్తున్నారు ఒక నిటిజన్ అయితే హోలీ కి పాత బట్టలు వేసుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ పాత బట్టలు వేసుకోవడంతో అవును నిజమే అంటూ తెగ నవ్వుకుంటున్నారు.