టాలీవుడ్ లోకి అమ్మాయి కాపురం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి మేనకోడలు మహేశ్వరి.ఆ తరువాత గులాబీ సినిమాతో గుర్తుండిపోయింది. దెయ్యం సినిమాలో ఇలా పలు చిత్రాలలో నటించింది. అప్పట్లో అందరి హీరోయిన్లలో ఈమె కూడా ట్రెండింగ్ లో ఉండేది. మహేశ్వరి సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. తెలుగుతోపాటు తమిళంలోనూ అవకాశాలను దక్కించుకుంది.
మహేశ్వరికి శ్రీదేవి పిన్ని వరుస అవుతుంది కానీ ఈమె ఎప్పుడు అక్క అని పిలుస్తూ ఉండేదట .శ్రీదేవి ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిందనే విషయం ఎవరికీ తెలియదు. మహేశ్వరి పలు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగింది. 2000 సంవత్సరంలో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ సినిమా తన ఆఖరి సినిమా అయ్యింది. ఆ తరువాత 2012లో మై నేమ్ ఇస్ మంగతాయారు అనే సీరియల్లో మహేశ్వరి బుల్లితెరలో నటించినది. ఆ సీరియల్ తర్వాత మళ్లీ తను బుల్లితెరలో కానీ వెండితెరపై కనిపించలేదు. అయితే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కానీ తనకు సంబంధించిన విషయాలను కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా షేర్ చేసుకునేది కాదు.
శ్రీదేవి చనిపోయిన తర్వాత శ్రీదేవికి దగ్గరి బంధువైన మహేశ్వరి శ్రీదేవి లేని లోటు తన పిల్లలకు తన ఫ్యామిలీకి తీర్చుతోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి తోడుగా ప్రస్తుతం మహేశ్వరి ఉంటోంది. శ్రీదేవిని మహేశ్వరీ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతేకాకుండా శ్రీదేవి ఫ్యామిలీలో మహేశ్వరి ఒక మొంబర్ కాబట్టి తన అత్త ఫ్యామిలీని మహేశ్వరి చూసుకుంటూ సంతోషంగా ఉంటోంది. అయితే మహేశ్వరి , జాన్వీ కపూర్ కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం మహేశ్వర్ కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.