టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం తన హవా బాగా కొనసాగిస్తోంది. దాదాపుగా స్టార్ హీరోయిన్లు సైతం పక్కన పెట్టి ఈమెనే తమ సినిమాలను హీరోయిన్గా కావాలని కొంతమంది దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఎంచుకోవడం జరుగుతోంది. దీంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరుపొందింది. ప్రస్తుతం శ్రీ లీల చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. అటు యంగ్ హీరోలు స్టార్ హీరోలు అందరూ కూడా ఈమెనే కావాలని కోరుకుంటున్నారు. తాజాగా బాలకృష్ణ 108వ సినిమాలో ఈమె బాలయ్య చెల్లెలిగా నటించబోతోందని వార్తలు వినిపించాయి.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి శ్రీలీల బిగ్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య సినిమాలో ఆల్రెడీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలియజేశారు. ఈ సినిమా కథ తండ్రీ కూతుర్ల మధ్య సాగుతుందని ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోందని తెలియజేయడం జరిగింది. సంక్రాంతికి ముందే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళిన కొంతమేరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో కొద్ది రోజుల్లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం.
ఈ షెడ్యూల్లో బాలకృష్ణ, శ్రీలీల మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల డేట్స్ అడగక ఆమె షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన డేట్లు ఖాళీగా లేవని చెప్పి మేకర్స్ ను వెనక్కి పంపించందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ అగ్ర హీరో మూవీకి డేట్స్ ఖాళీగా లేవని చెప్పడంతో ఆయన అభిమానులు సరిత ఈమెకు ఇంత పొగరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.