ప్రభాస్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న దీపిక.. ఎన్ని కోట్లు అంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రలలో ప్రాజెక్ట్ -k కూడా ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తున్నది. మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నది దీపిక. ప్రభాస్ ప్రస్తుతం అన్ని కూడా వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లోనే ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇలా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారని వార్తలు కూడా వినిపిస్తున్నది.

Actor Prabhas Postpones 'Project K' Shoot To Help Deepika Padukone Recover  After Health Scare

ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఈ సినిమా కోసం దీపిక పదుకొనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా రూ.12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని అశ్వని దత్ నిర్మాతగా రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.

Deepika Padukone and Prabhas Join Hands In First Scene of Project K Watch

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా 70% పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే చిత్రానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది .ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక అభిమానులు కూడా ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Share.