అలా చూపించి నన్ను వెలివేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న పూనమ్ కౌర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకోలేక పోయినా హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడ ఒకటి.మొట్టమొదటగా మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఈమె ఆ తరువాత పలు సినిమాలలో నటించింది. ఈమె సినిమాలలో కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులో పూనమ్ కౌర్ నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పూనమ్ కౌర్ కంటతడి పెట్టుకోవటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Poonam Kaur: ప్లీజ్ నన్ను అలా చూడొద్దు: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్

నేను తెలంగాణ బిడ్డనని నన్ను దూరం చేయొద్దని కామెంట్స్ చేసింది. నాకు మతం పేరు చెప్పి నన్ను వెలివేయద్దని ఆమె మొరపెట్టుకున్నది. ఇండస్ట్రీలో ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే సినీ ప్రపంచంలో ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతోందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తనకు అన్యాయం జరుగుతోందని పూనమ్ కౌర్ తెలుపుతోంది. మొన్న జరిగిన ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రీతికి న్యాయం జరగాలని పూనమ్ కౌర్ కామెంట్స్ చేయటం గమనార్హం

నేను పంజాబీ అమ్మాయినని సిక్కు మతమని నన్ను నా మతం పేరు చూపించి వెలివేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు. నన్ను తెలంగాణ నుంచి వేరు చేయొద్దని తాను హైదరాబాదులోనే పుట్టానని ఆమె అన్నారు. అయితే పూనమ్ కౌర్ ఇంతలా ఎమోషన్ అవ్వటానికి రీజన్ ఏంటనే ప్రశ్నకు సమాధానం అంత చిక్కడం లేదు అభిమానులకు. పూనమ్ కౌర్ సినిమాలకు దూరమై చాలా ఏళ్ళు అవుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. మరికొంతమంది పూనమ్ కౌర్ సామాజిక అంశాలకు సంబంధించి ఆమె స్పందించే తీరుపై పూనమ్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Share.