మంచు మనోజ్, మౌనిక రెడ్డి మార్చి మూడవ తేదీన మంచు లక్ష్మీ నివాసంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 12 సంవత్సరాలుగా ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమగా మారి ఇప్పుడు ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. ఎట్టకేలకు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఈ నూతన దంపతులు. వివాహం అనంతరం మోహన్ బాబు దంపతుల ఆశీర్వాదాలు తీసుకున్న ఈ జంట ఆ తరువాత కర్నూలు ఆళ్లగడ్డకు చేరుకొని మౌనిక రెడ్డి తల్లిదండ్రులైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేసిన వీరు స్వామి వారి ఆశీస్సుల తర్వాత మీడియాతో మాట్లాడారు. నిన్న తిరుపతి నుంచీ బయలుదేరిన వీరు మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో మంచు మనోజ్ మౌనిక రెడ్డి ఇద్దరు కలిసి కొడుకుతో పూజలు చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న మనోజ్ , మౌనిక మధ్యాహ్నం మోహన్ బాబు నిర్మించిన కళాశాలకు వెళ్లిన నూతన దంపతులకు విద్యార్థులు మంచి ఫ్యామిలీ సన్నిహితులు సాగర ఆహ్వానం పలికారు.
అనంతరం సాయిబాబా ఆలయంలో మనోజ్, మౌనిక దంపతులు ప్రత్యేక పూజలు చేయగా.. తర్వాత మోహన్ బాబు ఇంటికి వెళ్లి దేవుడి గదిలో చిత్రపటాల వద్ద పూజ చేశారు.ఇకపోతే మొదటిసారి వివాహం తర్వాత మంచు మనోజ్ సొంత గడ్డపై అడుగుపెట్టడంతో అక్కడి ప్రజల ఆనందాలు అంబరాన్ని ఉంటాయి. నూతన దంపతులకు అక్కడి విద్యార్థులే కాదు ప్రజలు కూడా చాలా ఘనంగా ఆహ్వానం పలికారు. దీన్ని బట్టి చూస్తే సొంత గడ్డలో మంచు మనోజ్ కు ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.