తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్వయంవరం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రేమించు, హనుమాన్ జంక్షన్, దేవుళ్ళు, శివరామరాజు, టాటా బిర్లా మధ్యలో లైలా తదితర వంటి హిట్ సినిమాలలో నటించింది.కానీ ఎందుకో గాని ఈమె కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగించలేక పోయింది. దీంతో గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కాలిఫోర్నియాలో ఈమె అక్కడే సెటిల్ అయ్యింది.
ప్రస్తుతం ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా రీ యంట్రి ఇచ్చింది. కానీ అది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అరవింద సమేత సినిమాలో ఈమెకు అవకాశం వస్తే ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉన్నది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా లయ ఒక ఫ్లాప్ సినిమాలో నటించిన అందుకే తన కెరియర్ ఇలా అయ్యింది అంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
లయ మాట్లాడుతూ కే విశ్వనాథ్ గారు, కోడి రామకృష్ణ గారు సీనియర్ వంశీ ఈవివి, ఎస్వి కృష్ణారెడ్డి గారి వంటి దర్శకులతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని తెలియజేసింది. కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారితో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం నా దురదృష్టం కాకపోతే వాళ్లతో కలిసి పనిచేయడం ఒక అందమైన జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుందని తెలిపింది. ప్రేమిస్తే సినిమాలో అందురాలి పాత్రను చేయవద్దని చాలామంది చెప్పారు అలాంటి పాత్రలు చేస్తే కెరియర్లో చాలా ఇబ్బందులు పడతాయని తెలిపారు. అయినప్పటికీ ఆ సినిమాను ఓకే చేశాను హిట్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది నాకు నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. కానీ మా బాలాజీ సినిమా అనవసరంగా చేశానని ఫీలింగ్ కలిగింది. కానీ ఈ సినిమా సమయంలో ఎలాంటి కథలు ఒప్పుకోవాలో తెలియక ఆ సినిమా చేశానని తెలిపింది లయ.