కేరాఫ్ కరచపాలెం చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా లైఫ్ యాంథాలజీగా వచ్చిన ఈ సినిమా యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత కూడా వెంకటేష్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ స్టోరీ తో ఈ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఈ డైరెక్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ మహాతో పాటు టాలీవుడ్ లోని కొంతమంది దర్శకులు నందిని రెడ్డి ,ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివ నిర్వాణ, వివేకాత్రేయ వంటి వారు పాల్గొనడం జరిగింది.
వెంకటేష్ మహా మాట్లాడుతూ ఇండియన్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం కేజిఎఫ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడున్న మేము ఐదుగురం ఇంకా మాస్ సినిమాలు తీసి ఇండస్ట్రీలోకి ఇంకొంతమంది డైరెక్టర్స్ మేమందరం మా అభ్యుదయ భావాలను పక్కనపెట్టి వైలెన్స్ సినిమాలు తీస్తే వాళ్లకన్నా చాలా గొప్పగా తీయగలం.. కానీ మేము అది ఇప్పుడు చేయలేదని కొన్ని విలువలతో కూడిన సినిమాలు మాత్రమే తీస్తున్నామని వాటిని చూసి.. ఇవి ఓటీటి సినిమాలు అంటూ జనాలు డీగ్రేడ్ చేస్తున్నారని తెలిపారు.
కే జి ఎఫ్ సినిమాలో లాస్ట్ లో ఆ గనుల్లో పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి.. ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్లి సముద్రంలో పడేసే నీచ్ కమీన్ కుత్తే గాడి మీద సినిమా తీస్తే మనం బాగా చప్పట్లు కొడుతున్నాము అంటే కేజీఎఫ్ చిత్రం గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.