బాలయ్య ను ఎదిరించడానికి సిద్ధమైన బాహుబలి ముద్దుగుమ్మ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో సీనియర్ హీరో బాలయ్య ఈమధ్య మంచి సినిమా కథలతో ఊపందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం . ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ని నెగిటివ్ రోల్ కోసం ఆమెను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Do you know Nora Fatehi worked as a waitress before?

ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే బాహుబలి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన నోరా ఫతేహి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాకుండా ఆమె పాత్ర కథకు అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ రోల్ కోసం పలువురు ముద్దుగుమ్మలను పరిశీలించిన రావిపూడి చివరకు ఈ బాలీవుడ్ బ్యూటీ ని ఎంపిక చేశారని సమాచారం.అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Balaya – Boyapati BB3 Movie update :అందరూ వెయిట్ చేస్తున్న బాలయ్య-బోయపాటి  రిలీజ్ డేట్ వచ్చేసింది.. సూపర్ టైంలో వస్తున్నాడు.. | NewsOrbit

ఈ సినిమాలో బాలయ్య 60 ఏళ్ల వ్యక్తిల కనిపించబోతున్నాడట. బాలయ్యను ఆ గెటప్ లో చూస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు అంటూ యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక సైడు బాలయ్య మరో సైడ్ కాజల్ అగర్వాల్ ఇంకో సైడు నోరా ఫతేహి వీరందరూ కనిపించటంతో సినిమా స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక నోరా ఫతేహి విలనిజం చూపించబోతోందంటూ వస్తున్న వార్తలు సినిమా స్థాయిని ఇంకాస్త పెంచుతున్నాయి. బాలయ్య సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి సందడి చేశాడు. మరి ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

Share.