వరుస గ్లామర్ ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకుని జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె తల్లి శ్రీదేవి.. తండ్రి పెద్ద నిర్మాత.. నటిగా పరిచయం అవడానికి ఈ రెండు కారణాలు ఈమెకు బాగా సహాయపడ్డాయి. కరణ్ జోహార్ నిర్మించిన ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. జాన్వీ కపూర్ మన తెలుగులో కెరియర్ స్టార్ట్ చేసి భారతదేశం గర్వించదగ్గ యాక్టర్ అయ్యారు శ్రీదేవి.. కానీ జాన్వి కపూర్ మాత్రం హిందీలోనే తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.
ఇక జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు హిట్ అవుతుంది అంటూ అప్పుడే మన తెలుగు ఆడియన్స్ కూడా డిసైడ్ చేశారు. హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు సినిమాలు యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బులతోనే కొత్త ఇల్లు, కార్లు, హ్యాండ్ బ్యాగులను కొనుగోలు చేసినట్లు సమాచారం.మరి వాటి విలువ ఎంత అనే విషయానికొస్తే జాన్వి కపూర్ దగ్గర మెర్స్ డెస్ గ్లే 250 D కారు ఆమె సొంతం దీని విలువ రూ.67.15 లక్షలు. బీఎండబ్ల్యూ x5 విలువ రూ.82.9 లక్షలు, మేర్స్ డేస్ బెంజ్ ఎస్ క్లాస్ విలువ రూ. 88.28 లక్షలు, మెర్సిడెస్ మే బ్యాక్ ఎస్ 560 విలువ రూ.1.98 కోట్లు..
ఇక ఆమె ధరించే ఒక్కొక్క లెహంగా విలువ సుమారుగా 1.25 లక్షల వరకు ఉంటుంది.. ఇక తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే క్విల్టెడ్ షోల్డర్ ఛానల్ బ్యాగ్ విలువ రూ.6,81,000.. డెనిమ్ అండ్ నియాన్ బ్యాగ్ బై ఛానల్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ.3,13,400 లక్షలు, వింటేజ్ ఛానల్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ.2,13,640 , స్కై బ్లూ బ్యాగ్ ఫ్రొం లూయిస్ విత్తోన్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ.1.6 లక్షలు, వీటితోపాటు మిగతా బ్యాగుల విలువ సుమారుగా కొన్ని మూడు లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం