వారి బలవంతం వల్లే జబర్దస్త్ మానేసిన అనసూయ.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా తనదైన అందం, టాలెంట్, వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది అలా సుదీర్ఘ కాలం పాటు టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఈమె ఈమధ్య సినిమాలలో కూడా ఒక రేంజ్ లో తన హవా చూపిస్తోంది. ఫలితంగా వరుస ఆఫర్లతో హడావిడి చేస్తున్న ఈమె తాజాగా చిట్ చాట్ నిర్వహించగా అందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా జబర్దస్త్ వీడడానికి కారణం వారే అంటూ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

తాజాగా అనసూయ భరద్వాజ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో ఎంతోమంది నెటిజన్స్ ఆమెను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. వీటికి ఆమె మంచిగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ .. ” మేడం .. మిమ్మల్ని మేము టీవీ ఛానల్ లో లేదా బుల్లితెరపై ఎప్పటినుంచి చూడొచ్చు” అని ఆమె ఎంట్రీ గురించి ప్రశ్నించాడు. నెటిజన్ ప్రశ్నకు అనసూయ..” టీవీ ఛానల్ లో ఎప్పుడైతే చెత్త జోకులు, గౌరవాన్ని పోగొట్టే టీఆర్పి స్టంటులు లేకుండా పోతాయో.. అప్పుడే వస్తాను.. నేను కూడా టీవీని బాగా మిస్ అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

బుల్లితెరపై బలవంతంగా టిఆర్పి స్టంట్ లు చేయిస్తున్నారని పరోక్షంగా తెలిపింది అనసూయ. దీంతో ఇప్పుడు అనసూయ చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇకపోతే అనసూయ ఇప్పుడు బుల్లితెర షోలకు దూరమైనా.. పలు సినిమాలలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏది ఏమైనా అనసూయ ఎప్పటికైనా బుల్లితెరపైకి వస్తుందని అభిమానులు ఆత్రుతగా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share.