బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ నటిస్తున్న చిత్రాలలో ప్రాజెక్ట్-k చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ సెట్లో చిన్న ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా మిగతా వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు అమితాబచ్చన్. కొద్దిరోజుల క్రితం సొంతంగా బ్లాగ్ క్రియేట్ చేసిన అమితాబ్ తన జీవితంలో జరిగిన విషయాలను సైతం పంచుకున్నారు.
తాజాగా ఇందులో ప్రాజెక్టుకే సినిమా సెట్ లో జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తనకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలోని ఒక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీంతో డాక్టర్లు తనకు సిటీ స్కానింగ్ కూడా చేశారని మిగతా వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. అయితే గాయాలు కాస్త నొప్పిగానే ఉన్నప్పటికీ కదలడానికి ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉందని తెలిపారు అమితాబచ్చన్.
నొప్పికి మందులు ఉపయోగిస్తున్న గాయం కారణంగా చేయవలసిన పనులన్నీ కూడా ఆగిపోయాయి చికిత్స పూర్తి అయ్యేవరకు ఎలాంటి పనులు చేయకూడదని ముఖ్యమైన పనులను ఫోన్ ద్వారానే అటెండ్ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా మరింత క్యూరియాసిటీ పెంచగా ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది