Tarakaratna.. నందమూరి తారకరత్న మరణం అటు కుటుంబ సభ్యులను, ఇటు సినీ రాజకీయ నాయకులను చాలా కలవరపెడుతోంది. ఇప్పుడు తారకరత్న మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్న చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఒక సీక్రెట్ లాకర్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
తారకరత్న మరణించి రెండు వారాలు కావస్తోంది. ఇటీవలే అతడి పెద్దకర్మ కూడా నిర్వహించారు కుటుంబ సభ్యులు.. ఈ సమయంలో తారకరత్న సీక్రెట్ లాకర్ అంటూ ఒక న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో దానిని తాజాగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓపెన్ చేసి చూసారని సమాచారం. అందులో కొన్ని విలువైన భూమి పత్రాలతో పాటు కూతురు నిష్కా వస్తువులను కూడా తారకరత్న దాచి ఉంచారట. తమ ప్రేమకు ప్రతిరూపం అని చెప్పుకుంటూ పెద్ద కూతురు నిష్క ను తారకరత్న ఎంతో ప్రేమగా చూసుకునే వారట. అంతేకాదు నిష్కా చిన్నప్పుడు వాడిన మొదటి వస్తువులన్నీ ఆయన లాకర్లో భద్రంగా దాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తారకరత్న సీక్రెట్ లాకర్ నుంచి బయటపడిన ఈ వస్తువులు చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోవడమే కాదు అలేఖ్య రెడ్డి, వారి కూతురు నిష్కా కూడా ఖంగ తిన్నారని తెలుస్తోంది. ఇక నిష్క వాటిని చూసి మరింత ఎమోషనల్ అవుతోందని సమాచారం.