హైదరాబాదులో ఈ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది.కేవలం కొంతమంది బంధుమిత్రుల, స్నేహితుల సమక్షంలోని జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీరి వివాహానికి రారు అనుకున్న మోహన్ బాబు కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది.
ఈ వేడుకకు అంతా తానై నడిపించిన మంచు మనోజ్ సోదరి లక్ష్మీ కూడా కొంతమంది సిని పరిశ్రమలో ఉండేవారని పిలిచినట్లు సమాచారం. అందులో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కూడా ఉండడం గమనార్హం. ఇక మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇందులో నరేష్, పవిత్ర కు సంబంధించి ఫోటోలు, వీడియోలు తెగ హైలైట్ గా మారుతున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ నరేష్ భార్య రమ్య రఘుపతి విడాకులు అంగీకరించకపోవడంతో వీరి పెళ్లి ఇంకా వీలుపడలేదు. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి అందుకే నరేష్, పవిత్ర కేవలం సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఎలాంటి వేడుక జరిగిన వీరిద్దరూ కచ్చితంగా అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ అతని భార్య మరణిస్తే వీళ్లు కూడా అక్కడే ఉండడం జరిగింది. ప్రస్తుతం మంచు మనోజ్ పెళ్లిలో ఇద్దరు హైలైట్ గా నిలిచారు.