ఒకప్పుడు హీరోయిన్స్ అంటే పెళ్లి చేసుకుంటే తన కెరీర్ ముగిసిపోతుందని చాలా లేటుగా వివాహాలను చేసుకునేవారు. ఇప్పుడు తొందరగా పెళ్లిళ్లను చేసుకుని పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో అయితే ఈ పంధా ఎప్పటినుంచో కొనసాగిస్తున్నది. అయితే ఈమధ్య సౌత్ లో కూడా పెళ్లయిన హీరోయిన్స్ ఛాన్సులు అందుకుంటున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా చేరింది.టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని పెళ్లి చేసుకుని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. ఒకప్పుడు పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలు అంటూ సినిమాలకి దూరం అయిపోయేవారు హీరోయిన్స్. ఇప్పుడు అలా కాదు. వివాహమైన కూడా రీ ఎంట్రీ ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు. అయితే కాజల్ ప్రస్తుతం ఇండియన్ -, ఎన్.బి.కె 108 సినిమాలతో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమిళంలో కూడా మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొత్తానికి కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే అని చెప్పవచ్చు. ఇప్పటికే అరడజం సినిమాలను చేతిలో పెట్టుకొని తన ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తోంది . అయితే చాలామంది హీరోయిన్స్ పెళ్లయిన తర్వాత కమర్షియల్ సినిమాల కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కాజల్ కూడా అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో అయితే అలాంటి సినిమాలనే చేయాలని అనుకుంటుందట. అయితే అభిమానులు మాత్రం రీ ఎంట్రీ ఇచ్చినందుకు కాస్త సంతోషంగా ఫీల్ అవుతున్నారు.