టాలీవుడ్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు.గతంలో సమంతను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సిద్ధార్థ్ మరోసారి సోషల్ మీడియాలో వార్తలలో నిలుస్తూ ఉన్నారు. హీరోయిన్ అదితి రావ హైదరి,సిద్ధార్థ్ మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. మొన్నటికి మొన్న అదితి చెప్పిన ప్రేమ కబుర్లు వింటే నిజంగానే అదితి ప్రేమలో ఉన్నట్టు కనిపిస్తోంది. అదితి ,సిద్ధార్థ డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి.
అతిది తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ కలిసి చేసిన రీల్‌ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేయటంవల్ల సోషల్ మీడియాలో రూమర్స్ కు మరింత బలం చేకూరింది. దీంతో మరోసారి వీరిద్దరిపై లవ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అతిధి తమ రిలేషన్షిప్ గురించి వస్తున్న పుకార్లపై సీరియస్ గానే స్పందించింది. నా సినిమాల గురించి అడగండి నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటూ ఫైర్ అయ్యింది.
రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రూమర్స్ పై స్పందించింది అతిది.నేను హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల పైనే దృష్టి పెడుతున్నాను.. మీరు నాలోని నటిని గుర్తించి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చేయబోయే సినిమాల గురించి అప్ కమింగ్ వచ్చే సినిమాల గురించి నన్ను అడగండి వివరంగా మీకు వివరిస్తాను. దయచేసి నా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకండి అని చెప్పుకొచ్చింది. ఇలాంటి రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి ఇవన్నీ పట్టించుకోవడం అంటూ తెలిపింది అతిధి రావు హైదరి.