సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరైన సమంత ఎప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన మనసులో ఉన్న ఆలోచనలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ ఈమె పెట్టే పోస్టులు మరియు స్టోరీలను చూస్తే సమంత ఎంత ఎమోషనల్ మనిషి అనేది మనకు అర్థం అవుతుంది. రీసెంట్ గా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.
ప్రస్తుతం సమంత గురించి వినిపిస్తున్న వార్తల విషయానికి వస్తే ఆమె టాలీవుడ్ ని వదిలేసి శాశ్వతంగా బాలీవుడ్ వైపుకే వెళుతోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి మరొకవైపు అందుకు తగ్గట్టుగా ఈమె టాలీవుడ్ లో ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నా సరే అందుకు ఒప్పుకోకుండా బాలీవుడ్ లో సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ అవుతోంది. ది ఫ్యామిలీ మాన్ టు వెబ్ సిరీస్ తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదటి సిరీస్ తోనే బోల్డ్ గా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ సిరీస్ కారణంగానే తన వైవాహిక జీవితానికి కూడా దూరమైన విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో అవకాశాలు అందుకోకుండా బాలీవుడ్ లో ఇప్పుడు వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో పెండింగ్ లో ఉన్న ఖుషి లాంటి సినిమాలను పూర్తి చేసి పూర్తిగా తన మఖాం బాలీవుడ్ కి మార్చబోతోంది. అక్కడ కూడా సినిమాలు చేయకుండా కేవలం వెబ్ సిరీస్ లకే పరిమితం కాబోతోందని సమాచారం. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.