సినిమా ప్రపంచంలో ప్రేమలు పెళ్లిళ్లు విడాకులు సహజంగా మారిపోయాయి.వాటికి విలువ కూడా లేదు. ఎవరితో అయినా ఇట్టే ప్రేమలో పడతారు.. అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లికి బంధాలకు ఎమోషన్స్ కి వ్యాల్యూ లేదు. అందుకే చాలామంది హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్నాక పలు కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏమిటంటే పిల్లలు ఉన్నా కూడా తల్లులను వివాహం చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్యాణ్ దేవ్
ఈయన చిరంజీవి అల్లుడు శ్రీజ రెండో భర్త . శ్రీజ మొదటి భర్తతో ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో కొన్ని సమస్యలు తలెత్తటంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ ని మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రీజ. అయితే వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మంచు మనోజ్
ఇక రీసెంట్గా భూమా దంపతుల చిన్న కుమార్తె మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే మౌనికకి ఇంతకుముందే పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నాడు. మనోజ్ , ప్రణీత రెడ్డి తో వివాహం జరిగాక మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమయంలో మౌనికతో స్నేహం ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.
గౌతమి
గౌతమి ఈమె తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. మొదట గౌతమి వేరొక వ్యక్తితో పెళ్లి చేసుకొని కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న సమయంలో కమలహాసన్ తో ప్రేమలో పడి సహజీవనం సాగించింది.
శరత్ కుమార్
శరత్ కుమార్, రాధిక రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ..ఆ తర్వాత శరత్ కుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అప్పటికే కుమార్తె కూడా ఉంది. శరత్ కుమార్ కూడా ఒక కొడుకు ఉన్నాడు. అయినా వీరిద్దరూ మల్లి పెళ్లి చేసుకుని ఉంటున్నారు.