ఎట్టకేలకు మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో రాత్రి అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కీలక నేత దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు.
మంచు మనోజ్ కి ఇది రెండో వివాహం కాగా.. మౌనిక కు కూడా ఇది రెండో వివాహమే.. వీరి పెళ్లికి మోహన్ బాబు రాకపోవచ్చు.. అని పెద్ద ఎత్తున ముందు నుంచి వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఎట్టకేలకు మోహన్ బాబు, సతీసమేతంగా కనిపించి నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ టాలీవుడ్ లో మరొక వివాదం చెలరేగింది.. సోదరుడి వివాహం అంటే అన్ని తానే వ్యవహరించాల్సిన మంచు విష్ణు పెళ్లికి వచ్చి కొద్దిసేపు కూడా గడవకుండానే వెంటనే తన కుమారుడిని, కూతుర్లను తీసుకొని వెనక్కి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు ఎందుకు ఇలా చేశారు అంటూ ఆయనపై రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మంచు మనోజ్, మౌనిక రెడ్డి వివాహం చేసుకున్న సందర్భంగా మంచు మనోజ్ అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి వివాహం ఎలాగో పోయింది.. కనీసం రెండవ వివాహమైన కలకాలం కలిసి ఉండాలని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్ పరిసర ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. ఇకపోతే ఒకప్పుడు మోహన్ బాబు ఇదే నివాసంలో ఉండేవారు. కానీ ఆయన శంషాబాద్ నివాసానికి మారిపోయి ఆ ఇంటిని తన కూతురికి ఇచ్చారు. ఆమె ఈ నివాసంలో మంచు మనోజ్ వివాహం జరిపించింది. అయితే మంచు విష్ణు మాత్రం ఎందుకు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.