తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకొని హీరోగా పేరు సంపాదించిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ టీంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఈయన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయి మంచి గుర్తింపు సంపాదించారు. ఈ క్రేజ్ తోనే బుల్లితెర మెగాస్టార్ గా కూడా పేరు సంపాదించారు. వరుస బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను అందుకొని చాలా బిజీగా గడుపుతున్నాడు సుదీర్.
బులితేరపై రష్మీ, సుధీర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే వీరిద్దరూ ఏదైనా షో చేస్తున్నారంటే చాలు ఆ షో కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే ఇదంతా ఇలా ఉండగా ఇండస్ట్రీలో సుధీర్ ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం వేణు అంటూ తాజాగా పెను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు వండర్స్ కొన్ని కారణాల చేత జబర్దస్త్కు దూరమయ్యారు. ఇలా ఈ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చిన ఈయన ఏకంగా డైరెక్టర్ గా మారి దిల్ రాజు బ్యానర్లో బలగం అనే సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ వేణు గురించి మాట్లాడుతూ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం వేణు అన్.. నేను నా ఫ్యామిలీ ఈరోజు మూడు పూటలా అన్నం తింటున్నామంటే అది కేవలం ఆయన వల్లే.. నాకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం ఇవ్వటం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. వేణు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు సుధీర్.