ALEKYAREDDY నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డిని (ALEKYAREDDY) ప్రేమించి మరీ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి కాపురం ఇప్పుడు ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి ఆ బాధ నుంచి బయటపడలేక పోతోంది. ఈ క్రమంలోనే నిన్న ఆయన కుటుంబ సభ్యులు తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాన్ని పూర్తి చేయగా.. గతంలో తారకరత్న తనకు రాసిన లవ్ లెటర్ ను అలేఖ్య రెడ్డి ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.
ఇకపోతే తారకరత్న రాసిన లేఖలో తనకు అసలు ప్రేమను వ్యక్తపరచడం రాదంటూనే భార్య అంటే తనకు ఎంత ప్రేమో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.. ఈ లేఖలో తారకరత్న.. “నాకున్నది నువ్వు మాత్రమే.. నువ్వంటే నా ప్రపంచం బంగారం” అంటూ భార్యకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తారకరత్న. ఈ లెటర్ చదివిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు అంత గొప్పగా ప్రేమించే భర్తను పొందడం నిజంగా అలేఖ్య రెడ్డి అదృష్టమని.. అలాంటి భర్తను కోల్పోవడం ఆమె దురదృష్టం అని కూడా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్లో.
అయితే ఈ లెటర్ పోస్ట్ చేస్తూ అలేఖ్య..” మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము.. జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను చూసాము.. అయినప్పటికీ నువ్వు నేను కలిసి ఇంత దూరం ప్రయాణించాము. ఎన్ని కష్టాలు ఎదురైనా మనం మన నమ్మకాన్ని కోల్పోకుండా మంచి రోజుల కోసం ఎదురు చూసాము. మనకోసం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాము.. అసలు నువ్వేంటో ఎవరికీ తెలియదు. నిన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.. బాధలన్నీ నీలోనే దాచుకొని ప్రేమను మాత్రమే మాకు పంచావు. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా నాన్న” అంటూ భర్తను తలుచుకొని ఎమోషనల్ అయింది అలేఖ్య రెడ్డి.
View this post on Instagram