మాజీ విశ్వసుందరి బాలీవుడ్ నటి సుస్మితసేన్ నిన్నటి రోజున ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పి సడన్ షాక్ ఇచ్చింది. తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా చెప్పి అందరిని కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం తాను గుండెపోటుకి గురయ్యానని వైద్యులు యాంజియోప్లాస్టి చేసి గుండె లోపల స్టంట్ అమర్చారని సుస్మితాసేన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు కూడా తెలియజేసినట్లు సుస్మితసేన్ తెలియజేసింది.
కేవలం తమ అభిమానులకు తన శ్రేయోభిలాషులకు ఈ విషయం తెలియాలని ఉద్దేశంతోనే చెప్పినట్లుగా తెలియజేసింది సుస్మిత సేన్ .. సడన్గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అంత ఒకసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో అభిమానులు సుస్మితాసేన్ కు ఏం కాకూడదని కోరుకుంటున్నారు. ఇక 47 ఏళ్ల సుస్మిత సేన్ చాలాకాలం తనకన్నా 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ రొహ్మన్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది ఇంస్టాగ్రామ్ లో రోహ్మన్, సుస్మితసేన్ కు డైరెక్ట్ గా మెసేజ్ చేసినట్లు సమాచారం.
అలా వీరి బంధం మొదలైంది. అయితే 2021లో సుస్మిత, రోహ్మాన్ మధ్య భేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే.. ఆ తర్వాత 2022 జూలై నెలలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో ఈమె రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా విడుదల చేయడం జరిగింది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్న సుస్మితసేన్ ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కేవలం ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుంది. 1996లో దస్తాక్ అనే చిత్రంతో పరిచయమయ్యింది. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం కుదుటంగా ఉన్నట్లు తెలియజేసింది.