త్వరలో అనుష్క పెళ్లి.. వరుడు ఎవరంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా నిశ్శబ్దం సినిమాలో కనిపించిన ఈమె ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. దాంతో సినిమాలకు స్వస్తి పలికింది అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి..కానీ ఇటీవల యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమాలో నటిస్తోంది అయితే ఈ సినిమాపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు.

Devasena Anushka Shetty Marriage with a Great Hearted boy? - News Portal

అందుకు తగ్గట్టుగానే అనుష్క గురించి ఒక జ్యోతిష్కుడు కూడా కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు. అసలు విషయంలోకి వెళితే.. అనుష్క తాను ప్రేమించిన వ్యక్తిని , ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను అసలు పెళ్లి చేసుకోదట. అంతేకాదు 2023లో అనుష్క పెళ్లి తప్పనిసరిగా అవుతుందని ఆ జ్యోతిష్కుడు స్పష్టం చేశారు. ఆమె బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.

దీంతో అభిమానులంతా త్వరలోనే మా స్వీటీ పెళ్లికూతురు కాబోతోంది అంటూ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇదే నిజమవుతుందా లేక ఇది రూమర్ గానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే అనుష్క పెళ్లి కోసం కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తనకు నచ్చిన వాడిని చేసుకుంటుందా లేక జ్యోతిష్యుడు చెప్పినట్టు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటున్న అనేది కూడా మరో పక్క ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే గతంలో ప్రభాస్ ని ప్రేమించింది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పినా సరే అభిమానులు మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఇద్దరు కూడా సింగిల్గానే ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి చూద్దాం ఏది నిజం అవుతుందో..

Share.