ఇంత పొగరేంటి బాలయ్య.. ఫైర్ అవుతున్న తారక్ ఫ్యాన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న దశదినకర్మ ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు అయితే ఈ కార్యక్రమంలో ఊహించని అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను మరింత కలవరపెడుతోంది.

దశదినకర్మలో భాగంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలకృష్ణ అసలు పట్టించుకోవడం లేదన్నట్లుగా ఇప్పుడు వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.. వాస్తవానికి కళ్యాణ్ రామ్ తో అప్పుడప్పుడు బాలకృష్ణ మాట్లాడుతున్నారే కానీ ఎన్టీఆర్ తో ఆయనకు అసలు మాటలు లేవన్నది ప్రథమంగా వినిపిస్తున్న మాట. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది మాత్రం వారికే తెలియాలి. అయితే ఇప్పుడు మరొకసారి వీరిద్దరి మధ్య మాటలు లేవు అని నిరూపించడానికి జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలను కనుక మనం గమనించినట్లయితే నిజంగానే బాలకృష్ణ .. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లను అవమానించారు అన్నట్లుగా తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే.. బాలయ్య వస్తున్నాడని కూర్చున్న కుర్చీలో నుంచి ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లేచి నించున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం వాళ్లను అలా చూసి పక్కకు తిరిగి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్లతో మాట్లాడేసి అటు నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ వీడియో అక్కడ ఉన్నవారికి ఎలాంటి అనుమానాలను కలిగించిందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు మాత్రం బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ను చూసి నిలబడిన వ్యక్తులకు కనీస గౌరవం నువ్వు ఇవ్వాలి కదా! అంత పొగరేంటి బాలయ్య అంటూ బాలకృష్ణ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు తారక్ ఫ్యాన్స్. మరి దీనిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Share.