సినీ ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో చెప్పడం అసాధ్యం.. అయితే కొంతమంది అవకాశాలకు కోసం సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తుంటే.. మరి కొంత మంది వచ్చిన అవకాశాలను దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కబడ్డీ భీమిలి జట్టు సినిమాలో నాని సరసన నటించిన శరణ్య మోహన్ కూడా ఒకరు. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగులో విలేజ్ లో వినాయకుడు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ప్రముఖ దర్శకుడు మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ లో పెద్దగా విజయాన్ని దక్కించుకోలేదు. దాంతో ఈమెకు కూడా గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డీ జట్టు చిత్రంలో నటించి కుర్ర కారును తన అందచందాలతో కట్టిపడేసింది. ఈ సినిమా హిట్ అవడంతో ఈమెకు కూడా మంచి పేరు వచ్చింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అలా హ్యాపీ హ్యాపీగా, ముద్ర , భీమిలీ కబడ్డీ జట్టు, విలేజ్లో వినాయకుడు తదితర చిత్రాలలో హీరోయిన్ పాత్రలో నటించిన ఈమె.. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన కత్తి చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
వరుస సినిమాలతో కెరియర్ సవ్యంగా సాగిపోతున్న సమయంలోనే.. తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించింది. అయితే ఉన్నట్టుండి 2015 వ సంవత్సరంలో తెలుగు భాషలో తెరకెక్కిన ముద్ర సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి, అటు నటనకు స్వస్తి చెప్పింది. ఇప్పటివరకు ఆమె మరే సినిమాలో కూడా కనిపించలేదు. తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇతను ఒక ప్రముఖ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం వీరికి అనంత పద్మనాభ అరవింద్, అన్నపూర్ణ అరవింద్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక శరణ్య పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. శరణ్యకు మళ్ళీ సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఆమె మాత్రం కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి అవకాశాలను రిజెక్ట్ చేస్తుందని తెలుస్తోంది.