నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎదుగుదల చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది. తొలి చిత్రం పోడాపొడి చిత్రంతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె అక్కడ విజయం సాధించలేదు. దాంతో ఆమె కెరియర్ అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు రావడానికి కూడా కష్టంగా మారింది..అలాంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.. హీరోయిన్ గా నటిస్తానని ఒక చట్రం లో ఇరుక్కోకుండా.. విలన్ గా కూడా.. ఛాలెంజింగ్ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమయ్యింది. అలాంటి పాత్రలలో నటించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది
ఇండస్ట్రీలో విజయశాంతి , రమ్యకృష్ణ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఏకైక నటి కూడా ఈమె కావడం గమనార్హం. బహుభాషా నటిగా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ చాలాకాలం గ్యాప్ తర్వాత హీరోయిన్ గా తమిళంలో నటించిన చిత్రం కొండ్రాల్ పావమ్.. ఇందులో హీరోగా సంతోష్ ప్రతాప్ నటించిన దర్శకుడిగా సుబ్రహ్మణ్యం శివ నటించారు. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం స్థానిక గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించగా.. నటుడు శరత్ కుమార్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై అందరూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను నటి విజయశాంతితో పోలుస్తున్నారు.. అది నిజమే మొదట్లో వరలక్ష్మీ నటిస్తానని చెబితే నేను వద్దు అనలేదు.. కానీ ముంబై యూనివర్సిటీలో ఎంఏ చదివి సినిమాలో నటించడం అవసరమా? అని అన్నాను. అయితే తాను మాత్రం నటించడానికి సిద్ధం అయ్యింది.. అయితే అతి తక్కువ సమయంలోనే తాను ఈ స్థాయికి రావడానికి కారణం తానే అని తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్వశక్తి తో పైకి ఎదిగింది.. వరలక్ష్మి బోల్డ్ అండ్ బ్రేవ్ వుమెన్ అని.. తన తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అంటూ తెలిపారు శరత్ కుమార్.