హీరోయిన్ నోరా ఫతేహీ తన తొలి సినిమా షూటింగ్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది.. సహనటుడు .. స్టార్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంటనే అతడి చెంప పగలగొట్టానని కూడా తెలిపింది.. ఇకపోతే బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా పలు ఐటమ్ సాంగ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బాహుబలి, టెంపర్, కిక్ 2 సినిమాలలో తన డాన్స్ తో యువతను ఆకట్టుకున్న ఈమె తొలి సినిమా షూటింగ్లో జరిగిన సంఘటనల గురించి తెలియజేసింది.
నోరా ఫతేహి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. నా తొలి సినిమా రోర్.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బంగ్లాదేశ్‌లో చిత్రీకరించడం జరిగింది. అక్కడ సీన్లో నటిస్తున్న నటుడు నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. కోపం వచ్చింది.. వెంటనే అటు ఇటు చూసుకోకుండా అతడి చెంప పగలగొట్టాను ..దీంతో అతడు కూడా నాపై చేయి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఇద్దరం కూడా జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నాము.. అంతమంది ఉన్నా కూడా మేము చాలా దారుణంగా గొడవపడ్డాము. కానీ ఎవరూ కూడా మాకు అడ్డు చెప్పలేదు.
ఆ తర్వాత దర్శకుడు కలుగజేసుకొని మాకు సర్ది చెప్పి ఆ తర్వాత మమ్మల్ని ఆపాడు. అంటూ నోరాఫతేహి తెలిపింది. ఇకపోతే 2014లో వచ్చిన బాలీవుడ్ చిత్రం రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్ బన్స్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత అక్కడే బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా చేసి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు నటి మాత్రమే కాదు మోడల్‌గా, సింగర్ గా, డాన్సర్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా వ్యవహరించింది. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న నోరా ఫతేహి ఇటీవల ఫిఫా థీమ్ సాంగులో కూడా డాన్స్ చేసి మెప్పించడం విశేషం