సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆఫర్స్ లేకుండా ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 19 సంవత్సరాలు పాటు సినీ ఇండస్ట్రీలో నిర్విరామంగా ఒకే పొజిషన్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటే నయనతారకు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నయనతార పెళ్లి తర్వాత కూడా 10 కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేస్తూ తన హవా కొనసాగిస్తుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ కు కలిసి రావడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో జయం రవి హీరోగా ఇరైవన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగులు పూర్తి కావడంతో ఆమె తదుపరిచిత్రం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే నయనతార ఇప్పుడు పెళ్లి తర్వాత అవకాశాలు లేక ఖాళీగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఒకరకంగా చెప్పాలి అంటే పెళ్లి ఈమె కెరియర్ కు అడ్డుగా మారిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పెళ్లి తర్వాత ఈమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె భారీగా రేమ్యునరేషన్ పెంచడమే .. అప్పట్లో రూ.8 కోట్ల పారితోషికం తీసుకున్న ఈమె ప్రస్తుతం రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఒకవేళ అవకాశాలు రాకపోతే సినిమా ఇండస్ట్రీకి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకోబోతుందట నయనతార. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.