టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట గూడాచారి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్ ,హిందీ వంటి పరిశ్రమలో కూడా నటించింది. అక్కినేని నాగచైతన్యతో ఈమె గత కొంతకాలంగా ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపారు. ఆ వెంటనే శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం మొదలు పెట్టారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
శోభిత ధూళిపాళ్ల తన అందం విషయంలో కెరియర్ విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లుగా తెలియజేయడం జరిగింది.. తనకు 20 సంవత్సరాల వయసులోనే ముంబైలోని ఒక యాడ్స్ ఏజెన్సీలోకి వెళ్లానని.. ఒక షాంపూ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలియజేస్తాను అందులో అవకాశం కోసం అడిగానని తెలియజేస్తోంది. ఆ సమయంలో వారు మీరు బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరారు అంటూ అవమానించారట అయితే అలా అవమానించిన కంపెనీ వారే ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తనకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయమని తెలియజేశారట.
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది. మొదట హిందీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గూడాచారి సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ చిత్రం ద్వారా పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందింది ప్రస్తుతం పలు కమర్షియల్ యాడ్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.
View this post on Instagram