సినీ ఇండస్ట్రీలో నటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ కాలేక కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమైన నందమూరి హీరో తారకరత్న ఇటీవల రాజకీయాలలోకి రావాలని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కలలుకని అందులో భాగంగానే కుప్పంలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి 39 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి రోజున శివైక్యం చెందారు.
అతి చిన్న వయసులోనే తారకరత్న మరణం అందరిని తీవ్ర దుఃఖానికి గురి చేస్తున్నప్పటికీ శివరాత్రి రోజున ఆయన మరణించాడు.. కాబట్టి తప్పకుండా ఆయనకు మరో జన్మ ఉంటుంది అంటూ సన్నిహితులు చెప్పడంతో ఎండిన చెట్టుకి కొత్త చిగురు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదే విషయంపై ఇప్పుడు పండితులు కూడా ఇదే చెబుతున్నారు.. తారకరత్న కి పునర్జన్మ ఉంటుంది. అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జ్యోతిష్యులు ఏం చెప్పారు అనే విషయాలు కూడా ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. శివరాత్రి రోజున చనిపోయిన తారకరత్నకు మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అంటూ జ్యోతిష్యులు చాలామంది చెబుతున్నారు.
ఎందుకంటే తారకరత్న శివరాత్రి పర్వదినాన అంటే శివుడు పుట్టిన ఆ పర్వదినాన శివైక్యమయ్యారు. కాబట్టి కచ్చితంగా ఆయన ఆత్మ శాంతించి.. ఆ కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్తుంది . ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి రోజు మరణించరు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాదు తారకరత్న కారణజన్ముడు.. ఆయనకు మళ్ళీ పునర్జన్మ కచ్చితంగా ఉంటుంది.. అందుకే ఆ మహాశివరాత్రి రోజున మరణించారు అంటూ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇకపోతే జ్యోతిష్యులు చెప్పిన ఈ శుభవార్త విని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.