సంగీత: నన్ను చూసి హీరోయిన్ ఏంటి అని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే.. హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది నటి సంగీత. ఈమె ఖడ్గం సినిమాతో తన అమాయకమైన నటనతో ఒక అద్భుతమైన పాత్రలో నటించింది. ఇక షో లకు జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అలరిస్తోంది ..అప్పట్లో సంగీతకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా శ్రీకాంత్ నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమాతో ఆమెకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు సినిమాలలో కూడ నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక తల్లి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే వారసుడు సినిమాలో వదిన పాత్రలో కనిపించింది.

Former heroine Sangeetha lands a pivotal role in Mahesh Babu's 'Sarileru  Neekevvaru'? | Telugu Movie News - Times of India

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖడ్గం సినిమా గుర్తింపు తెచ్చింది..కానీ అందులో నాకు మేకప్ మైనస్ అయిందని చెప్పింది. ఆ మేకప్ తో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపింది. ఎందుకంటే అక్కడ పల్లెటూరి అమ్మాయిలాగా కనిపించాను అంతేకాకుండా కట్టు బొట్టు అన్ని వేరేలా కనిపించాయి. ఇక ఆ సమయంలో నాకు మేకప్ వేసి అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్ర యూనిట్ అంతా వచ్చి చాలా బాగా వచ్చిందని చెప్పారట.కానీ అక్కడ ఉన్న పబ్లిక్ మాత్రం కృష్ణవంశీకి పిచ్చిపట్టిందా..?ఏంటి ఈ అమ్మాయి హీరోయిన్నెనా అందరూ అనుకున్నారట.

కానీ సినిమా రిలీజ్ అయ్యి బిగ్ హీట్ ఆవ్వటంతో నాకు మంచి గుర్తింపు పేరును తెచ్చిపెట్టింది. అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది నటి సంగీత.ఈ మధ్యనే చిరంజీవి గారి పాటతో ఫేమస్ కూడా అయ్యింది. ఇంకా రాను రాను మంచి సినిమాల్లో చేయాలని సంగీత అభిమానులు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంగీత కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share.