నాగశౌర్య వీడియో పై అలాంటి కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగ శౌర్య నిన్న రోడ్డు మీద హీరోయిజం చూపించడం వీడియోల ద్వారా బాగా వైరల్ అవుతుంది. ఒక యువకుడు తన లవర్ ను రోడ్డు మీద కొట్టడంతో నాగశౌర్య చూసి కార్ లో నుంచి దిగి హీరోయిన్ చూపించారు. మీ లవర్ అయితే కొడతావా ? సారీ చెప్పు… అసలు ఎందుకు కొట్టావ్? అంటూ రోడ్డు మీద నిలదీశాడు నాగ శౌర్య. అయితే ఇది సినిమా ప్రమోషన్స్ కోసం చేసిందా? లేదా నిజంగానే జరిగిన ఘటనా అన్నది? తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చర్చకు దారితీస్తోంది.. సదరు యువకుడిని కొట్టడం నిలదీయడం తప్పని.. కొంతమంది అంటుంటే వాడిని అలానే కొట్టాలంటే ఇంకొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు..

Naga Shaurya - IMDb

అంతేకాదు ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం ఏంటి? అంటూ నిలదీస్తున్నారు. వాడి లవర్ వాడి ఇష్టం.. మధ్యలో మనం వెళ్లడం ఎందుకని.. మరి కొంతమంది అంటున్నారు.. అంతేకాదు ఇదే సమయంలో ఒక మగాన్ని ఆడది కొడితే.. ఇలాగే స్పందించేవారా? అని కూడా అడుగుతున్నారు. ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన రష్మీకి ఒళ్లంతా మండి పోయింది. సదరు నెటిజన్ ల ట్వీట్ లను, స్క్రీన్ షాట్ల ను తీసి కడిగిపారేసింది. వాడి లవర్ వాడి ఇష్టం అంట.. అమ్మాయే సపోర్ట్ చేస్తుంది కదా.. ఇలాంటి కామెంట్లు చూస్తుంటే సిగ్గేస్తోంది.. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరికైనా తెలిసి మీరు మరో ఆత్మహత్య కఠినంగా జరగాలని కోరుకుంటున్నారా? అంటూ నిలదీసింది రష్మీ.

యువకుడితో నాగశౌర్య వివాదం.. నడిరోడ్డుపై యువతిని కొట్టినందుకు యంగ్ హీరో  ఆగ్రహం.!

అయితే రష్మి వేసిన ఈ ట్వీట్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి కొట్టుకునే సీన్లు స్క్రిప్ట్ తోనే జబర్దస్త్ కూడా రశ్మిని నిలదీస్తున్నారు. మొత్తానికైతే రష్మీ మాత్రం గత వారం నుంచి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అలాగే అంబర్ పేట కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ విషయంపై మాట్లాడడంతో కూడా ఆమెపై ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది.

Share.