మెగా డాటర్ శ్రీజ కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈమె గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక మొదటగా ఇమే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకున్నది. అప్పట్లో కుటుంబ సభ్యులకు దూరమైంది.. ఒక పాప కూడా జన్మించింది. గత కొంతకాలం తర్వాత శిరీస్ తో విడాకులు తీసుకొని మళ్ళీ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చింది శ్రీజ. ఆ తర్వాత కొద్ది రోజులకి కుటుంబ సభ్యులు శ్రీజాను కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి వివాహం చేశారు.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజేత సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ గత కొంతకాలంగా పట్టించుకోవడం లేదు.ప్రస్తుతం అతని చేతులో సినిమాలు కూడా లేవు. దీంతో హీరోగా కళ్యాణ్ దేవ్ కెరియర్ ముగిసినట్లే అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ తో విడిపోయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎవరు ప్రకటించలేదు కానీ ఇటీవల వ్యాలెన్స్ డే సందర్భంగా కళ్యాణ్ దేవి పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
ఈ పోస్టులో కళ్యాణ్ దేవ్ పేర్కొంటూ ఒక మనిషికి ఇష్టపడడం కంటే అతనిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామనేది ముఖ్యమ అంటూ పోస్ట్ పెట్టారు.. అటు శ్రీజ కూడా ప్రేమించడం పై పలు రకాలుగా పోస్టులను షేర్ చేసింది. దీంతో వీరిద్దరు విడిపోయారనే వార్తలు మరింత వైరల్ గా మారాయి. తాజాగా కళ్యాణ్ దేవ్ కి రెండవ పెళ్లి అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది ఇదే నిజం అనుకుంటున్నారు.కానీ ఇందులో వాస్తవం లేదట. ఈ ఫోటో కళ్యాణ్ దేవ్ ఫ్రెండ్ మ్యారేజ్ అన్నట్లుగా తెలుస్తోంది. తన ఫ్రెండ్ మ్యారేజ్ లో కళ్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.