బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ లో కస్తూరి అనే నటి నటిస్తున్నది .ఇక ఈమె పలు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నది. అయితే ఈ మధ్యకాలంలో అనసూయని నేటిజన్స్ ఆంటీ అని సంబోధించటంపై చాలా సీరియస్ అయినా సంగతి తెలిసిందే.. ఆంటీ అని పిలిస్తే కేసు పెడతాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతో ఈ ఘటన వైరల్ గా మారింది. ఆంటీ అనే మాట వయసొచ్చిన కుర్రాళ్ళు అంటే మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అంటూ కస్తూరి తెలుపుకోస్తోంది.
ఇదిలా ఉంటే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆంటీ అంటే తప్పేమీ లేదు. కానీ ఒక ఏజ్ వచ్చిన పిల్లలు ఆంటీ అంటే మాత్రం తప్పే ఎవరినైనా మహిళని ఆంటీ అని పిలిస్తే ఖచ్చితంగా అతను వేరే ఉద్దేశంతో అలా పిలుస్తుందన్నాడని అర్థం చేసుకోవాలి. అయితే హీరోలని ఎవరిని కూడా అంకుల్ అని పిలవరే..అమ్మాయిలని మాత్రమే అలా ఎందుకు పిలుస్తారు. అంటూ ఫైర్ అయ్యింది కస్తూరి. ఇప్పటికే ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ వచ్చేసింది. అలా పిలిస్తే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.ఈ విషయంలో అనసూయకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.
కస్తూరి రాజకీయాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను కూడా చేసింది. నాకు తమిళనాడు రాజకీయాలయితే పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఏపీ రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన లేదు. అయితే ఏపీ రాజకీయాల్లో తనకి వైయస్సార్ జగన్ అంటే అభిమానం అని కస్తూరి చెప్పుకొచ్చింది. ఒకవేళ పార్టీలో తప్పులు జరుగుతుంటే చెప్పకుండా ఉండలేము. అందుకే నాకు పార్టీలు సెట్ కావనీ తెలిపింది.