టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులు ఒకరైన లయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. స్వయంవరం అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా తన కెరీర్ను మొదలుపెట్టింది. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఈనటి ఆ తర్వాత ప్రేమించు, మనోహరం వంటి సినిమాలలో నటించి నంది అవార్డును సొంతం చేసుకున్నది.
13 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన లయ పలువురు స్టార్ హీరోలకు సైతం జోడిగా నటించింది.లయ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలను పంచుకుంటూ అభిమానులకు బాగా దగ్గరవుతున్నది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో తనకు పెళ్లి సంబంధం వచ్చిందని తెలియజేయడం జరిగింది. ఆ భర్త సినిమాలు చేయవద్దని ఎప్పుడు చెప్పలేదని కానీ ఎందుకో సినిమాలకు దూరం కావడం జరిగిందని తెలియజేసింది. లయ ఇప్పటికీ నా రిల్స్ ఫోటోలను ఆయనే తీస్తూ ఉంటారని తెలియజేస్తోంది .నా భర్త నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని తెలుపుతోంది లయ.
నా భర్త లేకుండా నేను ఏమి చేయలేనని కామెంట్లు చేయడం జరిగింది. కష్టపడి ఇండస్ట్రీలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అన్ని వదిలేసుకొని వెళ్లడం చాలా సులువు కాదని తెలిపింది. సినిమాలను కుటుంబాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోగలనని తెలియజేసింది. తన భర్త అమెరికాలో ఉండడం వల్ల దూరం బాగా పెరిగిపోయిందని లయ తెలియజేసింది. అందుచేతనే సినిమాలకు దూరం కావలసి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత సినిమాల అవకాశాన్ని వచ్చిన వదులుకున్నారని తెలుపుతోంది.