టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బన్నీ ఇమేజ్ ని మార్చేసిందని చెప్పవచ్చు. ఈ మూవీ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్
ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ కు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో కొన్ని విషయాలను ముచ్చటించాడు. రణబీర్ కు గతేడాది వచ్చిన నచ్చిన సినిమాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తనకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పాత్ర చాలా బాగా నచ్చింది అంటూ అలాంటి పాత్ర నాకు కూడా నటించాలని ఉంది అంటూ మనసులో మాటను బయటపెట్టాడు. గత రెండేళ్లలో నటన పరంగా నన్ను మూడు చిత్రాలు ప్రభావితం చేశాయి.
అందులో ఒకటి పుష్ప మరొకటి గంగుబాయి మూడో చిత్రం RRR సినిమాలోని పాత్రలు నాపై ప్రభావం చూపించాయి. ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. అని చాలాసార్లు అనుకున్నాను అంటూ రణబీర్ చెప్పుకొచ్చారు. అలాగే తాను గతంలో పాకిస్తాన్ చిత్రాలలో చేయాలని ఉందని చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెళ్ళిన కార్యక్రమాల్లో పాకిస్తానీ చిత్ర నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. మంచి కథలు ఉంటే పాకిస్తాన్ చిత్రాల్లో నటించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని వారు ప్రశ్నిస్తే దానికి సమాధానంగా కలకు ఎలాంటి హద్దులు ఉండవని అనుకుంటున్నానని అందుకే ఆ సినిమాల్లో నటిస్తానని చెప్పాను. అంతేకానీ ఈ మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలా రణబీర్ టాలీవుడ్ చిత్రాల గురించి ముఖ్యమైన విషయాలను బయటపెట్టారు.