Keerthy Suresh సినిమా సెలబ్రెటీలు ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా దారుణంగా తయారవుతున్నారు. ముఖ్యంగా తమ తోటి హీరోలు హీరోయిన్లతో ప్రేమలో పడడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి.ఇలా ప్రేమించుకున్న జంటలు కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళుతున్నాయి.మరి కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో డేటింగ్ చేసి అక్కడే తమ రిలేషన్స్ ను వదిలేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకు మరొకరితో డేటింగ్ చేస్తున్నారు.ఈ డేటింగ్ కల్చర్ అనేది సినీ రంగంలో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది.
ఈ ట్రెండు సౌత్లోకి కూడా బాగా పాకి పోయిందని చెప్పవచ్చు. ఎంతో హోమ్లీగా ఉండే హీరోయిన్స్ సైతం ప్రేమలో మునిగితేలుతున్నారు. అలాంటివారి లిస్టులో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)కూడా చేరిపోయింది. మొదట నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి సినిమాతో ప్రేక్షకులను చెదరని ముద్ర వేసుకుంది. అందాల ఆరబోయ వేయకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కీర్తి సురేష్. అయితే ఈమె కూడా ప్రేమలో పడిందని కోలీవుడ్ మీడియాలో గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అతను ఎవరో కాదు కోలీవుడ్ లవర్ బాయ్ అనిరుద్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్న అనురుధ్ గతంలో చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశారట .ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కూడా ఆయన మాయలో పడినట్లుగా అప్పట్లో ఎక్కువగా వార్త వినిపించాయి. వీరిద్దరూ క్లోజ్ గా దిగినటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి వార్తలు రావడంతో అతని నుంచి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుత కీర్తి సురేష్ భోళా శంకర్ , దసరా సినిమాలలో నటిస్తోంది.