తెలుగు సినీ పరిశ్రమలలో చిరంజీవి అంటే స్టార్ హీరోగా అందరికీ సుపరిచితమే. కానీ ఒకప్పుడు చిన్న క్యారెక్టర్లు కూడా వేసేవారు. అంతేకాకుండా విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. చిరంజీవి కంటే ముందే ఎన్టీఆర్ నాగేశ్వరరావు, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు టాప్ పొజిషన్ లో ఉండేవారు. అలాంటి టైంలో చిరంజీవి వేసే వేషాలకు అంత గుర్తింపు అయితే ఉండేది కాదు. అలాంటి టైంలో తన మామ అయిన అల్లు రామలింగయ్య చిరంజీవిని ఎంతగానో ప్రోత్సహించి సినిమా అవకాశాలను ఇప్పించారు.
ఇక సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించారు అల్లు రామలింగయ్య. అప్పటినుంచి చిరంజీవిని మంచి హీరోగా చేయటానికి ఎంతో కష్టపడ్డాడు. ఇక అదే టైంలో ఎన్టీఆర్ కొడుకు అయినా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు. చిరంజీవికి అల్లు రామలింగయ్య ఇలా చెప్పేవారట నువ్వు రోజు రామారావు గారు కనపడగానే నమస్కారం పెట్టు అని చెప్పేవారట.అప్పట్లో చిరంజీవి నివాసము రామారావు ఇంటి పక్కనే ఉండేదట. దాంతో ఆయన వచ్చినప్పుడు పోయేటప్పుడు ఎప్పుడు నమస్కారం పెట్టేవారట.కానీ అలా రామలింగయ్య ఎందుకు చేయమన్నారంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి చిరంజీవి అడుగు పెడుతున్నాడు అంతేకాకుండా రామారావు గారి కొడుకు బాలకృష్ణ కూడా అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కాబట్టి చిరంజీవి తన కొడుకు ఎదుగుదలకు ఎక్కడ అడ్డుపడతాడు అనే ఉద్దేశంతో రామారావు గారు చిరంజీవిని తొక్కేస్తాడేమో అన్న భయంతో అల్లు రామలింగయ్య అలా ఎన్టీఆర్ గారికి నమస్కారాలు పెట్టమని చెప్పేవారట.
అలా నమస్కారం చేస్తే ఇతడు కూడా మన వాడే అనే ఫీలింగ్ రామారావు గారికి కలుగుతుందని చెప్పేవారట.
ఎవ్వరైనా ఇండస్ట్రీలో ముందుకు రావాలంటే ఎవరో ఒక సహకారం ఉండాలి. అలా చిరంజీవి గారికి మామగారి సపోర్ట్ చాలా ఉండేదట. దాంతో అలా చిరంజీవి కాస్త మెగాస్టార్ గా ఎదిగారు.